VIDEO: సూర్యాపేటలో మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
సూర్యాపేటలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు ఆర్డీవో వేణుమాధవ్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార చేశారు. పట్టణాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. అధికారులు, వివిధ పార్టీల నేతలు, ప్రజల సమక్షంలో ఈ వేడుక ఉత్సాహంగా సాగింది. కొత్త పాలకవర్గం కొలువుదీరడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.