'రోడ్ సేఫ్టీ ఛాంపియన్ 2026' అవగాహన కార్యక్రమం

'రోడ్ సేఫ్టీ ఛాంపియన్ 2026' అవగాహన కార్యక్రమం

NLG: దేవరకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఐ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో 'ఆర్వీఏ లైవ్ రోడ్ సేఫ్టీ ఛాంపియన్-2026' కార్యక్రమం జరిగింది. సీఐ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అతివేగం, మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని కోరారు.