రెవెన్యూ శాఖకు ప్రతిష్టాత్మక అవార్డులు

AP: రాష్ట్ర రెవెన్యూ శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఆన్‌లైన్ కోర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, రీసర్వే 2.0కు గాను 2 స్కోచ్ అవార్డులు దక్కాయి. 2025 ఏడాదికి గానూ ప్రతిష్టాత్మక స్కోచ్ సమ్మిట్‌లో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. వచ్చే నెల 20న ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.