'యాదవుల సదర్ ఉత్సవాన్ని విజయవంతం చేయాలి'

NLG: నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఈ నెల 30న జరిగే యాదవుల సదర్ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా సదర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మద్ది శ్రీనివాస్ యాదవ్ కోరారు. జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవనంలో ఆయన మాట్లాడుతూ.. దీపావళి సందర్భంగా ప్రతి సంవత్సరం యాదవులు సదర్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారని, పాడిపంటలు చక్కగా ఉండాలని పూజిస్తారని పేర్కొన్నరు.