'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

MNCL: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ ఏడీఈ ప్రభాకర్ రావు సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. తాలూకా పరిధిలోని లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలంలో భారీ వర్షాలు పడుతున్నాయన్నారు. ఈ నేపద్యంలో తడిసి ఉన్న విద్యుత్ స్తంభాలకు ప్రజలు దూరంగా ఉండాలని కోరారు. ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగితే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.