వట్టిచెరుకూరులో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం
GNTR: ప్రత్తిపాడు మండలం వట్టిచెరుకూరులోని మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ నార్నెబాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు క్వింటాల్‌కు రూ. 5,875 కనీస మద్దతు ధరకు శనగలు విక్రయించవచ్చని పేర్కొన్నారు. ‘ఈ-క్రాప్’ నమోదు చేసుకున్న రైతులు నాణ్యత ప్రమాణాలతో శనగలను తీసుకురావాలని అధికారులు సూచించారు.