పుంగనూరు కోర్టులో జాతీయ 'లోక్‌అదాలత్'
CTR: పుంగనూరు కోర్టు ఆవరణంలో ఈనెల 13న జాతీయ 'లోక్‌అదాలత్' నిర్వహిస్తున్నట్లు న్యాయమూర్తి ఆరీఫా షేక్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆమె పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. లోక్‌అదాలత్‌లో రాజీకి అనువైన సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరిస్తామన్నారు. న్యాయవాదులు, అన్నిశాఖల అధికారులు తమ పరిధిలోని కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.