VIDEO: జీతాలు ఆలస్యం.. పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
GNTR: తెనాలి మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఆలస్యంగా చెల్లిస్తున్నారని సీపీఎం కార్యదర్శి బాబు ప్రసాద్ ఆరోపించారు. సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఉదయం మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు పాల్గొని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు.