గుంతకల్లు శ్రీ మహా శివునికి ప్రత్యేక పూజలు
ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గురువారం అమావాస్య సందర్భంగా శ్రీ మహా శివునికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేశారు. అమావాస్య రోజున శివుని పూజించడం వల్ల జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని భక్తుల నమ్మకం. శివుడికి బిల్వ పత్రాలు, పాలు, తేనె,నీరు సమర్పించారు.