జిల్లాలో దారుణ హత్య
W.G: తణుకు మండలం పైడిపర్రు డ్రైవర్స్ కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిసిన వివరాల ప్రకారం.. కందుల శ్రీను, శిరాళం ప్రభాకర్ (28) ఇరువురు స్నేహితులు కాగా ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో శ్రీను వేరే వ్యక్తితో కలిసి నిద్రిస్తున్న అతనిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.