ఎన్నికల్లోపే SLBC పూర్తి చేస్తాం: ఉత్తమ్
TG: ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టర్మ్‌లో SLBC పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. అసెంబ్లీ ఎన్నికల్లోపే పూర్తి చేస్తామని తెలిపారు. రూ.1800 కోట్ల డిండి ఎత్తిపోతల పనులు జరుగుతున్నాయని అన్నారు. డిండి పోతల కూడా పూర్తి చేసి దేవరకొండకు నీళ్లిస్తామని చెప్పారు.