చేపల వేటకు విరామం ప్రకటించిన మత్స్యకారులు

చేపల వేటకు విరామం ప్రకటించిన మత్స్యకారులు

ప్రకాశం: ప్రభుత్వం వాయుగుండం హెచ్చరికల జారీచేయడంతో సింగరాయకొండ మండలం పాకల గ్రామ మత్స్యకారులు సోమవారం చేపల వేట నిలిపివేశారు. ప్రభుత్వ సూచనలతో సముద్రంలోకి వెళ్లకుండా ఇళ్లలోనే ఉండిపోయారు. రోజు వారీగా చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, వర్షాకాలం రాగానే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని మత్స్యకారులు వాపోయారు.