'లక్షెట్టిపేట పట్టణంలో పరిశుభ్రతను కాపాడుదాం'
MNCL: లక్షెట్టిపేట పట్టణంలో పరిశుభ్రతను కాపాడుదామని మునిసిపల్ ఛైర్మన్ దొంత అంజలి నరసయ్య, వైస్ ఛైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకట్ స్వామి గౌడ్, కమిషనర్ విజయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 'ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రధాన చౌరస్తా వరకు కౌన్సిలర్లు, అధికారులు ర్యాలీ నిర్వహించారు.