కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

ఖమ్మం అర్బన్ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే, మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు.