ఇంటిపై పిడుగు పడడంతో విద్యుత్ ఉపకరణాలు దగ్ధం
VZM: కొత్తవలస శివారు, మంగళపాలెం యాతపేటలో సిమ్మ పైడిరాజు ఇంటిపై గురువారం పిడుగు పడడంతో విద్యుత్ ఉపకరణాలు పాడయ్యాయి. అదే ప్రాంతంలో ఉంటున్న ఈశ్వరమ్మ పిడుగుదాటికి స్పృహ కోల్పోవడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. భారీ నష్టం ఏర్పడిందని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. పిడుగు పడిన ప్రదేశాన్ని మండల రెవెన్యూ పరిశీలకులు షణ్ముఖరావు, వీఆర్వోలతో కలిసి పరిశీలించారు.