డోర్నకల్లో ముగిసిన సన్నహాక సమావేశం

MHBD: డోర్నకల్ నియోజకవర్గం కేంద్రంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 27న జరగనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్‌తో పాటు పలువురు కార్యకర్తలు హాజరయ్యారు.