డిగ్రీ పరీక్ష వాయిదా

డిగ్రీ పరీక్ష వాయిదా

KDP: యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలో  సోమవారం జరగాల్సిన డిగ్రీ పరీక్షలను 'దిత్వా' తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వాయిదా వేసినట్లు YVU పరీక్షల నియంత్రణ అధికారి కృష్ణారావు ఆదివారం తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, వాయిదా పడిన పరీక్ష తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన వివరించారు. కళాశాల ప్రిన్సిపల్స్ గమనించాలని కోరారు.