VIDEO: మాయ మాటలు చెప్పి రూ.2 లక్షల నగల చోరీ
ASF: కాగజ్ నగర్‌లో బంగారానికి మెరుగుపెడతామని ఓ వృద్ధురాలిని దుండగులు మోసగించారు. రూ.2లక్షల రూపాయల విలువైన నగలను చోరీ చేశారు. పట్టణానికి చెందిన సంధ్య శ్రీవాత్సవ ఇంటికి సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు బంగారానికి మెరుగు పెడతామని వచ్చారు. నమ్మిన వృద్ధురాలు చెవి కమ్మలు, చైన్ మెరుగు పెట్టేందుకని ఇవ్వగా వాటిని అపహరించి పారిపోయారని బాధితురాలు తెలిపింది.