సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: SP
KMR: జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కోనాపూర్, హన్మాజీపేట్ గ్రామాలలో బుధవారం పర్యటించారు. ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న పోలింగ్ సరళిని, అలాగే బందోబస్తు ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.