'మందిని తొక్కడం.. మాట తప్పడం రేవంత్ నైజం'
SDPT: సీఎం రేవంత్ రెడ్డివి వికృత చేష్టలు, విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు పనికొచ్చేవి ఒక్క పని కూడా చేయడని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మందిని తొక్కడం.. మాట తప్పడం రేవంత్ నైజం అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిన్న జరిగిన సీఎం ప్రెస్ మీట్ చూసినవారికి రేవంత్ రెడ్డి మానసిక స్థితిపై సందేహం కలుగుతుందన్నారు. రేవంత్ రెడ్డి తినే కంచంలో ఉమ్మిచ్చే రకమని విమర్శలు గుప్పించారు.