నేటి నుంచి బాలికలకు HPV వ్యాక్సిన్
KRNL: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు నేటి నుంచి 14 ఏళ్లు వయసు గల బాలికలకు ఉచితంగా HPV టీకాలు వేయనున్నట్లు పుచ్చకాయలమడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రాఘవనాయుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలి విడతగా ఇవాళ నుంచి చేపట్టనున్న ఈ టీకాల కార్యక్రమాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.