మంచి నీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన

మంచి నీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన

కాకినాడ: దళిత ప్రాంతానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద దళితులు ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం సామర్లకోట మండలం వెంకటకృష్ణరాయపురం శివారు సత్యవరం గ్రామస్తులు తమకు మంచినీరు కల్పించాలని కలెక్టర్ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. దళిత నాయకులు ఏనుగుపల్లి కృష్ణ, సిద్ధాంతుల కొండబాబు పాల్గొన్నారు.