'అఖండ 2' సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్

'అఖండ 2' సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్

నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. నిన్న రాత్రి జరిగిన ఈరోస్ సంస్థ,14రీల్స్‌ చర్చలు సఫలం అయ్యాయి. ఈ మూవీ విడుదలకు ఈరోస్ సంస్థ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ మద్రాస్ హైకోర్టులో ఈ కేసుపై విచారణ జరగ్గా.. 'అఖండ 2' విడుదలకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది.