నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మల్దకల్ ఎస్సై
MDK: మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలోని సర్పంచ్, వార్డు మెంబర్ నామినేషన్ కేంద్రాన్ని మల్దకల్ ఎస్సై నందీకర్ మంగళవారం పరిశీలించారు. నామినేషన్ వేసే అభ్యర్థులు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా ఉండేందుకు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్సై తెలిపారు. ఈ పరిశీలనలో ఏఆర్ ఎస్సై ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ పూజయ్య, కానిస్టేబుల్ పరుశురాముడు తదితరులు పాల్గొన్నారు.