ముసునూరులో అంగన్వాడీలు నిరసన

ELR: అంగన్వాడి వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ముసునూరు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయు ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయు ముసునూరు మండల కార్యదర్శి కొడవలి శ్రీనివాసరావు మాట్లాడారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.