యువతి దారుణ హత్య.. ప్రియుడిపైనే అనుమానం!
ASF: పెంచికలపేట మండలం కొండపల్లిలో సమ్మక్క (25) అనే ఆదివాసి యువతి హత్యకు గురైన విషయం తెలిసిందే. ప్రియుడే ఆమెను గొంతు నులిమి చంపి మృతదేహాన్ని సలుగుపల్లి అటవీ ప్రాంతంలో పడేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.