18 వరకు అడ్మిషన్లకు గడువు

NLG: తెలంగాణ ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్‌లో అడ్మిషన్ల దరఖాస్తులకు ఈనెల 18వరకు గడువు ఉందని మాడుగులపల్లి మండలం ఆగామోత్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఏలేటి వినోద్ కుమార్ తెలిపారు. పదో తరగతి, ఇంటర్ అడ్మిషన్ కోసం రికార్డు షీట్, ఆధార్ కార్డు, 2 పాస్ ఫొటోలు, కులధ్రువీకరణ, పదోతరగతి మెమో తీసుకరావాలని పేర్కొన్నారు.