'ఆలయాల అభివృద్ధికి పాలకమండళ్లు కృషిచేయాలి'

'ఆలయాల అభివృద్ధికి పాలకమండళ్లు కృషిచేయాలి'

కోనసీమ: ఆలయాల అభివృద్ధికి పాలకమండళ్లు విశేషంగా కృషి చేయాలని కొత్తపేట జనసేన ఇన్‌ఛార్జ్ బండారు శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం రావులపాలెం మండలం లక్ష్మిపోలవరం గ్రామంలో శ్రీ మదన గోపాలస్వామి వారి ఆలయ నూతన ధర్మకర్తల ప్రమాణస్వీకారం మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. పాలకమండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.