GOOD NEWS: పావలా వడ్డీకే రుణాలు
TG: విదేశీ విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. పావలా వడ్డీతో రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ‘కలలకు రెక్కలు’ పేరుతో పథకాన్ని ప్రవేశ పెట్టనుంది. ఈ మేరకు ‘పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు ప్రకటించారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడమే కలలకు రెక్కలు పథకం లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.