వాడపల్లి ఆలయంలో సెల్ ఫోన్లు భద్ర పరిచేందుకు వేలం

కోనసీమ: ఆత్రేయపురం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు మొబైల్ ఫోన్లు భద్ర పరిచేందుకు ఆలయ ప్రాంగణంలో గురువారం సాయంత్రం వేలం పాట నిర్వహించారు. పాటదారులు రూ.43,99,999కు పాట పాడినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. పెనుమత్స పద్ద రాజు పాట దక్కించుకున్నట్లు వెల్లడించారు.