నంద్యాలలో రోడ్డు ప్రమాదం

నంద్యాలలో రోడ్డు ప్రమాదం

NDL: నంద్యాల - గిద్దలూరు రోడ్డు మార్గంలోని దొరబావి వంతెన వద్ద ఇవాళ లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడం వల్లే ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు.