ఓటరు పరిచయ ర్యాలీలో గులాబీ దండు
RR: షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వెంకటయ్య ఓటర్ పరిచయ ర్యాలీలో ముందుకు సాగుతున్నారు. తమదైన శైలిలో ఓటర్లను పలకరిస్తూ తమవైపు ఆకర్షించే ప్రయత్నం ముమ్మరం చేశారు. కార్యకర్తలు, ప్రజలతో కలిసి ప్రచారం చేస్తూ కదులుతున్నారు. ర్యాలీలో గులాబీ దండుతో పాటు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.