ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం
MNCL: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం భీమిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో డాక్టర్ అనిత మాట్లాడుతూ.. శిబిరంలో చిన్న పిల్లలకు టీకాలు, నేత్ర, ఆర్థోపెడిక్, డెంటల్ తదితర వైద్య సేవలు, అసంక్రమిత వ్యాధులు, క్యాన్సర్, నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.