VIDEO: 'చంద్రబాబు సొంత మనుషులకు భూములు ఇస్తున్నారు'
కృష్ణా: మచిలీపట్నం నుంచి తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి 'కోటి సంతకాల' పత్రాల తరలింపు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ సోమవారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అంటేనే మోసం అని తెలిసి కూడా, ఆయనను ఎన్నుకున్నామన్నారు. అమరావతికి 30 కిలోమీటర్ల దూరంలో ఎయిర్ పోర్టు ఉందని, 5,000 ఎకరాలను సేకరించి చంద్రబాబు తన సొంత మనుషులకు కట్టబెడుతున్నారన్నారు.