తూతూ మంత్రంగా పనులు

తూతూ మంత్రంగా పనులు

MLG: ఏటూరునాగారం మం. దొడ్ల-మల్యాల మధ్య జంపన్న వాగుపై సోమవారం చేపట్టిన మరమ్మతు పనులు ఒక్కరోజు గడవక ముందే మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షానికి చిన్నపాటి వరదకే రోడ్డు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. కాగా, సక్రమంగా పనులు చేయకపోవడంతో మళ్లీ మట్టి కుంగి, భారీ గుంత ఏర్పడింది.