CM కోరుకున్న విధంగా వన్ మ్యాన్ కమిటీ: భూమన

TPT: తిరుమల తొక్కిసలాట ఘటనపై CM చంద్రబాబుకు అనుగుణంగా వన్ మ్యాన్ కమిటీ నివేదిక ఇచ్చిందని వైసీపీ నేత భూమన మండిపడ్డారు. కావాల్సిన వారికి CM అనుకూలంగా సాక్ష్యం ఇప్పించారని ఆరోపించారు. తొక్కిసలాట ఘటనలో గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, డీఎస్పీ రమణను బలి పశువులు చేశారని విమర్శించారు. ఆరుగురు చనిపోతే కమిటీ పాక్షికంగా నివేదిక ఇచ్చిందని నిప్పులు చెరిగారు.