పులిపాద ముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు..!
SDPT: చిన్నకోడూర్ మండలంలోని విఠలాపూర్ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద పెద్దపులి పాద ముద్రలను అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. రెండు రోజులుగా చౌడారం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఉన్న పెద్ద పులి ఇటు వైపు వచ్చిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ, పోలీసు శాఖ అధికారులు హెచ్చరించారు.