కార్గో ఎయిర్‌పోర్ట్ వ్యతిరేకంగా గ్రామస్థుల నిరసన
SKLM: పలాస నియోజకవర్గం రాంపురం గ్రామంలో శుక్రవారం గ్రామస్తులు, రైతులు కార్గో ఎయిర్‌పోర్ట్‌కు వ్యతిరేకంగా నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పచ్చని ఉద్దానంలో కార్గో ఎయిర్ పోర్ట్ వద్దు అని నినాదాలతో కార్గో ఎయిర్‌పోర్ట్ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రాజెక్టు అమలైతే జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.