'ఫీజు పోరు దీక్ష' కరపత్రాలు ఆవిష్కరణ
HNK: నగరంలోని కేయూ మొదటి గేటు ముందు శనివారం 'ఫీజు పోరు దీక్ష'కు సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బీసీ విద్యార్థి JAC రాష్ట్ర కోఆర్డినేటర్ ఆరేగంటి నాగరాజు ఆవిష్కరించారు. బడ్జెట్ సమావేశంలో ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు విడుదలచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 15న HYDలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.