మండలంలో పర్యటించిన మాజీ జడ్పీ చైర్మన్

KMM: మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో బుధవారం ఖమ్మం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ముమ్మరంగా పర్యటించారు. ముందుగా మండలంలోని పలు గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశమై వారి గ్రామాలలో గల ముఖ్య సమస్యలను గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.