జిల్లాలో 'డ్రగ్ డిటెక్షన్ స్పెషల్ డ్రైవ్'
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ. లక్ష్మీశ, పోలీస్ కమీషనర్ S.V రాజశేఖర్ బాబుతో కలిసి జిల్లాలో 'డ్రగ్ డిటెక్షన్ స్పెషల్ డ్రైవ్' ప్రకటించారు. విద్యా సంస్థలు, హాట్‌స్పాట్ ప్రాంతాలపై దృష్టి, డ్రోన్ నిఘా, ప్రత్యేక బృందాలు, ప్రజల అవగాహనను సమీక్షించారు. అనంతరం అవగాహన పోస్టర్‌లను విడుదల చేశారు. డ్రగ్స్ రహిత జిల్లా కోసం పౌరులు కృషి చేయాలని వారు తెలిపారు.