సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి: ఏఎస్పీ రమేష్

NLG: సైబర్ జాగారుకత దివాస్ సందర్భంగా ప్రగతి కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, అదనపు ఎస్పీ రమేష్, ఎస్పీ శరత్ చంద్ర విద్యార్థులకు సైబర్ మోసాల పట్ల జాగ్రత్తలు సూచించారు. బ్యాంక్ ఓటీపీలను ఎప్పుడూ ఎవరూ అడగరు, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దు అని హెచ్చరించారు. బాధితులు 1930 నంబరుకు ఫిర్యాదు చేస్తే వెంటనే సహాయం అందుతుందని తెలిపారు.