రోడ్డు పనులు ఆలస్యం అయితే కాంట్రాక్టర్‌పై చర్యలు: ఎమ్మెల్యే
TPT: వెంకటగిరి–బాలాయపల్లి రహదారి పనులు మరో రెండు రోజుల్లో ప్రారంభం కాకపోతే కాంట్రాక్టర్‌ను మార్చి బ్లాక్‌లిస్టులో పెడతామని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హెచ్చరించారు. రోడ్డు పనుల్లో ఆలస్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు పనులను వెంటనే ప్రారంభించి నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.