అవసరమైతేనే ఈ మార్గన ప్రయాణించాలి : MPDO

అవసరమైతేనే ఈ మార్గన ప్రయాణించాలి : MPDO

KDP: జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాల్లపల్లె - థర్మల్ రోడ్డులో వంక వద్ద ప్రవాహం శుక్రవారం వర్షాల కారణంగా ఉద్ధృతంగా కొనసాగుతోంది. దీంతో నీటి మట్టం పెరగడంతో వాహనదారులు రహదారిపై ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని MPDO వెంకటరమణ సూచించారు. అజాగ్రత్తగా వెళితే ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కాగా, అవసరం అయితేనే ఈ మార్గాన ప్రయాణించాలని సూచించారు.