సమ్మర్ క్రాష్ వాహనం ప్రారంభం
VZM: కొత్తవలస ఎంపీడీవో కార్యాలయంలో సమ్మర్ క్రాష్ వాహనాన్ని జడ్పీటీసీ శ్రీదేవి, ఎంపీపీ గోపమ్మ సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. రానున్న వేసవి నేపథ్యంలో నీటి ఎద్దడి తలెత్తకుండా మండలంలోని అన్ని గ్రామాలకు 45 రోజులుపాటు నీటి పంపులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శివ, తదితరులు పాల్గొన్నారు.