‘రాజీవ్ హయాంలో భయం లేదు, ఇప్పుడుంది’
ప్రధాని మోదీ ప్రభుత్వంపై ప్రియాంకా గాంధీ విమర్శలు చేశారు. తన తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రజలు నేరుగా ప్రశ్నించే స్వేచ్ఛ ఉండేదని గుర్తుచేశారు. అమేఠీలో ఓ మహిళ తన తండ్రిని కుళాయి గురించి నిలదీసిన ఉదంతాన్ని ఆమె వివరించారు. 'ఆమె ఏమాత్రం భయపడలేదు. కానీ ఇప్పుడు హక్కుల గురించి ప్రశ్నిస్తే, పోలీసులు కొడతారు, నోరు మూయిస్తారు' అని ప్రియాంక ఆరోపించారు.