రేపటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన
ప్రధాని మోదీ రేపటి నుంచి మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ టూర్‌లో ఆయన జోర్దాన్, ఇథియోపియా, ఒమన్ దేశాలను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ఆయా దేశాల అధినేతలతో భేటీ అయి, ద్వైపాక్షిక సంబంధాలు, పలు కీలక ఒప్పందాలపై చర్చలు జరపనున్నారు. రేపే ఆయన ప్రయాణం మొదలవుతుంది. వరుసగా మూడు దేశాల్లో పర్యటించనుండటంతో షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉండబోతోంది.