మన్నూరు రూరల్‌కు కొత్త సీఐ
అన్నమయ్య: రాజంపేట మన్నూరు రూరల్ సీఐగా ఏపీ మస్తాన్ నియమితులయ్యారు. గుంతకల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన, ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న బీవీ రమణ అనంతపురం జిల్లా వీఆర్‌కు మార్చడంతో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రూరల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, గ్యాంబ్లింగ్, గంజాయి, వంటి అనుచిత కార్యకలాపాలను కఠినంగా అరికడతానన్నారు.