గరికపాటి ఫోటోలను ఎస్ఎఫ్ఐ దహనం
W.G: భీమవరంలో ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఫోటోలను ఎస్ఎఫ్ఐ నేతలు దహనం చేశారు. విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి చేసిన 'కోడిగుడ్డు, గాడిద గుడ్డు' అనే వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు.