బండి సంజయ్‌కు సునీల్ రావు లేఖ

KNR: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు పెద్ద వినాయక విగ్రహాలను తరలించడంలో అడ్డంకులను తొలగించాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌కు మాజీ మేయర్ సునీల్ రావు లేఖ రాశారు. గజ్వేల్, సిద్దిపేట వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్టీల్ గడ్డర్లను తొలగించి, విగ్రహాలకు మార్గాన్ని సుగమం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.